డాన్ ఇంటికి ధనాధన్ రేట్.. రూ.3.5 కోట్లకు దక్కించుకున్న ట్రస్ట్!

  • దావూద్ ఇంటిని వేలం వేసిన ప్రభుత్వం
  • దక్కించుకున్న సైఫీ బుర్హానీ ట్రస్ట్
  • కూల్చేసి కొత్త భవనం నిర్మిస్తామని ప్రకటన
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు ముంబైలో ఉన్న ఇంటిని అధికారులు ఎట్టకేలకు వేలం వేశారు. దావూద్ తల్లి అమీనా బీ పేరుతో ఉన్న ‘అమీనా మాన్షన్’ను రూ.3.5 కోట్లకు సైఫీ బుర్హానీ అప్ లిఫ్ట్ మెంట్ ట్రస్ట్ దక్కించుకుంది. ముంబైలోని పక్ మోడియా వీధిలో ఈ ముడంతస్తుల భవనం ఉంది. ఈ భవనాన్ని దక్కించుకున్న సైఫీ బుర్హానీ సంస్థ దీన్ని కూల్చేసి కొత్త బిల్డింగ్ ను నిర్మిస్తామని తెలిపింది.

కాగా, ఈ వేలంలో అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధి, సుప్రీం న్యాయవాది భూపేంద్ర భరద్వాజ్ కూడా పాల్గొన్నారు. దావూద్ వదిలివెళ్లిన కారును 2015లో హిందూ మహాసభ ఢిల్లీ అధ్యక్షుడు స్వామి చక్రపాణి రూ.32 వేలకే కొని బహిరంగంగా తగలబెట్టారు.
Go Back to Shorts
dawood
amina mansion
auction

More Telugu News